గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి
గర్భిణులకు అవగాహన కల్పిస్తున్న డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నీలవేణి
చింతపల్లి: గర్భిణులు ప్రసవ సమయం వరకు వేచి చూడకుండా ముందుగానే ఆసుపత్రుల్లో చేరాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి సూచించారు. మంగళవారం స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భిణులకు పీఎం ఎస్‌ఎస్‌ఏ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె వివరించారు. వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


