ప్రపంచ శాంతి కోరుతూ సాధువు యాత్ర
నిలువు దండాలతో యాత్ర చేస్తున్న సాధువు ఉపేంద్రదాస్
చింతూరు: ప్రపంచ శాంతిని కోరుతూ ఓ సాధువు గంగోత్రి నుంచి రామేశ్వరానికి చేపట్టిన నిలువు దండాల యాత్ర మంగళవారం మండలంలోని చట్టికి చేరుకుంది. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి నుంచి తమిళనాడులోని రామేశ్వరం వరకు 3,300 కిలోమీటర్ల మేర ఈ యాత్ర చేపట్టినట్లు సాధువు ఉపేంద్రదాస్ తెలిపారు. గత 29 రోజుల క్రితం యాత్ర చేపట్టానని, రామేశ్వరం చేరుకుని పరమశివుని దర్శనంతో తనయాత్ర ముగించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో కరువు కష్టాలు రాకుండా ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి పౌరుడు దేశభక్తి చాటాలని కోరుతూ యాత్ర కొనసాగిస్తున్నట్లు ఉపేంద్రదాస్ తెలిపారు.


