ఆశ్రమ పాఠశాలల తనిఖీ
బందపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి
రంపచోడవరం: మండలంలోని వివిధ ఆశ్రమ పాఠశాలలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రంపచోడవరంలోని కస్తూరిభాగాంధీ విద్యాలయం, గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, బందపల్లి బాలుర పాఠశాలను ఆయన మంగళవారం పరిశీలించారు. దీనిలో భాగంగా బాలిక వసతి గృహంలో మరుగుదొడ్లు పరిశుభ్రత, నీటి సమస్యను గమనించారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చేపట్టేలా గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు సూచనలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.


