డిజిటల్ గ్రంథాలయాలకు ప్రతిపాదనలు
● ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్‌రాజు
డుంబ్రిగుడ గ్రంథాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కార్యదర్శి కుమార్‌రాజు
డుంబ్రిగుడ: స్థానిక శాఖ గ్రంథాలయాన్ని మంగళవారం ఉమ్మడి విశాఖ గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్‌రాజు సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పూర్తిస్థాయిలో భవనాలు ఉన్న గ్రంథాలయాలను డిజిటల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు అందించామన్నారు. గిరిజన యువత గ్రంథాలయాలను సద్వినియోగంజ చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన కోరారు. గ్రంథాలయ అసోసియేషన్ యూనియన్ ప్రతినిధులు ఆనందరావు, రమణ, గ్రంథాలయాధికారి సునీత, సిబ్బంది కె. సుబ్బారావు పాల్గొన్నారు.


