సర్కార్ వైద్యం సామాన్యుడికి దూరం
పాడేరు : వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం సర్కారు వైద్యం సామాన్యులకు దక్కకుండా చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో అరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు చెట్టి పాల్గుణ, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన వైద్య కళాశాలలను కూటమి ప్రభుత్వం స్వలాభ కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం అన్యాయమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సర్కారు వైద్యంపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం, విశ్వాసం ఉండేదన్నారు. వైద్య రంగంలో అనే సంస్కరణలు తీసుకువచ్చి అన్నివర్గాల ప్రజలకు మేలు చేయగా నేడు ఆ పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలను కలుపుకుని ఈనెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్ కుమార్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి జర్సింగి సూర్యనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, సర్పంచ్‌లు సోమెలి లక్ష్మణరావు, గుమ్మా శ్యాం సుందర్, ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి, పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గుల్లెలి లింగమూర్తి, మహిళా విభాగం మండల అద్యక్షురాలు కోడా సుశీల, క్రిస్టియన్ మైనారిటీ విభాగం జిల్లా సీనియర్ నాయకులు మోదా బాబూరావు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ స్వలాభం కోసమే
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు
పాడేరులో ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
ఈనెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు


