గురిపెట్టిన విల్లంబులు
సాక్షి,పాడేరు: స్థానిక ప్రభుత్వ జూనియార్ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలు రెండవ రోజు శనివారం ఉత్సాహభరితంగా జరిగాయి. కోచ్‌లు,తల్లిదండ్రుల సమక్షంలో అండర్ 14,17,19 విభాగాల్లో 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను ప్రదర్శించారు. బాలబాలికలంతా తమ పాయింట్లను న్యాయ నిర్ణేతల సమక్షంలో పరిశీలించారు. అనుభవజ్ఞులైన న్యాయ నిర్ణేతలను ఫెడరేషన్ నియమించింది. పోటీలను తిలకించేందుకు స్థానికులు తరలివచ్చారు. ఇండియన్ రౌండ్‌కు సంబంధించి అండర్ 14, అండర్ 17లో 20, 30మీటర్లు, అండర్ 19లో 30,40 మీటర్ల విభాగాల్లో పోటీలు ఆదివారం నిర్వహించేందుకు వీలుగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆర్చరీ ఆసోసియేషన్లు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
గురిపెట్టిన విల్లంబులు


