ప్రకృతి సాగు ప్రోత్సాహానికి చర్యలు
● ఏపీ రైతు సాధికారిత సంస్థ
ఈడీ బాబురావునాయుడు
గూడెంకొత్తవీధి: ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ రైతు సాధికారిత సంస్థ ఈడీ టి. బాబురావునాయుడు తెలిపారు. ఆదివారం ఆయన గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రావణాపల్లి, పెదవలస, దేవరాపల్లి పంచాయతీల్లో ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం భూమికి మేలు చేస్తుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుతుందని తెలిపారు. రైతులు ఈ విధానంలో సాగు చేపట్టాలని కోరారు. ప్రకృతి విధానంలో సాగు చేసిన పంట ఉత్పత్తులకు స్థిరమైన ధరలు కల్పిస్తామన్నారు. పెదవలస పంచాయతీ టెంట్ల వీధిలో రైజ్‌బెడ్ విధానంలో సాగు చేస్తున్న పసుపు పంటను ఆయన పరిశీలించారు. డీసీఎం భాస్కరరావు, గిరిజన వికాస్ సంస్థ కార్యదర్శి ఎన్. సత్యనారాయణ, కోఆర్డినేటర్లు యమున, రమ్య పాల్గొన్నారు.


