కళా ఉత్సవ్ ఏర్పాట్లపరిశీలన
రంపచోడవరం: మారేడుమిల్లిలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఏకలవ్య పాఠశాలల రాష్ట్ర స్థాయి కళాఉత్సవ్ ఏర్పాట్లను రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరణ్‌రాజ్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించి కళా ఉత్సవ్–2025 ఈ ఏడాది మారేడుమిల్లి ఏకలవ్యలో జరుగుతున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి 5వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. గురుకుల జాయింట్ సెక్రటరీ ప్రసాద్, డీడీ రుక్మాండయ్య, ప్రిన్సిపాల్ శంకర్, తహసీల్దార్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


