నిలిచిన సేవలు... తప్పని అవస్థలు
● గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు ఆటంకం
● స్తంభించిన సెల్ సిగ్నల్, నెటవర్క్ వ్యవస్థ
జి.మాడుగుల: మండలంలో వంతా పంచాయతీ కేంద్రంలో గల బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు గడిచిన మూడు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వంతాల గ్రామంలో శనివారం గిరిజనులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ నుంచి సిగ్నిల్స్ వ్యవస్థ సక్రమంగా లేక సచివాలయంలో నెట్ పనిచేయకపోవడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. గిరిజన ప్రజలు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెప్పారు. సమాచార వ్యవస్థ పనిచేయక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. తరచూ బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు నిలిచిపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని వారు చెప్పారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.
తాగునీటి సమస్య పరిష్కరించండి
వంతాల పంచాయతీలో బండారువీధిలో గత కొన్నాళ్లుగా తీవ్ర త్రాగునీటి సమస్య ఎదుర్కోంటున్నామని గ్రామస్తులు తెలిపారు.గతంలో వేసిన కుళాయి పైపులు శిధిలావస్థకు చేరుకొని నీరంతా వృధా పోతుందని వీధిలోని నీరు రావటం లేదని వారు తెలిపారు.ధీంతో వీధిలో గల మహిళలు కాలినడకపోయి మంచినీటి కోసం ఊటగెడ్డలను ఆశ్రయించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరారు.


