పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
రాజవొమ్మంగి: మండలంలోని కిండ్ర జంక్షన్ మలుపు వద్ద నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు శనివారం అదుపుతప్పి వరి పొలాల్లోకి దూసుకుపోయింది. స్థానిక రైతులు గమనించి వెంటనే కారు వద్దకు వెళ్లి అద్దాలు పగుల గొట్టి లోపల ఉన్నవారిని బయటకు తీశారు. ఈ సంఘటనపై స్థానిక రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం నుంచి కృష్ణాదేవిపేటకు వెళ్తున్న రాజమణి, కరుణాకర్ దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు కారులో ప్రయాణిస్తున్నారు. కిండ్ర జంక్షన్ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిందన్నారు. ప్రమాదాన్ని గమనించి అక్కడే ఉన్న రైతులు హుటాహుటిన అక్కడికి వెళ్లి కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న వారిని చాకచక్యంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా సురక్షింతగా ఉన్నారని, ఇద్దరిక స్వల్పగాయాలవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్థానికులు బాధిత కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు యంత్రాల సహాయంతో కార్‌ను పొలాల్లోంచి తిరిగి రోడ్‌పైకి తెచ్చారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
త్రుటిలో తప్పిన ప్రమాదం
పొలాల్లోకి దూసుకెళ్లిన కారు


