ఆకట్టుకున్న సాంస్కృతికనృత్యోత్సవాలు
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మతల్లి పేరుతో తొలిసారిగా మోద అవార్డ్స్–2025 గిరి శీతల సాంస్కృతిక నృత్యోత్సవాలను స్థానిక ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే భరతనాట్యం, కూచిపూడి పోటీలకు అనేక ప్రాంతాలకు చెందిన బాలికలు తరలివచ్చారు. పోటాపోటిగా చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొలిరోజు పోటీల్లో పాల్గొన్న బాలికలకు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గిడ్డి ఈశ్వరి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నృత్యాంజలి డ్యాన్స్ అకాడమి గురువు చైతన్యప్రభు, గిరి కై లాస క్షేత్రమండలి సభ్యురాలు కొట్టగుళ్లి రమాదేవి, ఇతర ప్రతినిధులు కొండపల్లి సత్యవతి, నిర్మల, వెంకటరావు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతికనృత్యోత్సవాలు
ఆకట్టుకున్న సాంస్కృతికనృత్యోత్సవాలు


