చేపల వేటలో వినూత్నం
బొత్త పద్ధతిలో ఎర
చింతూరు: ఏజన్సీ ప్రాంతంలో గిరిజనులు చేపలవేట సాగించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మండలంలోని పెదశీతనపల్లికి చెందిన శ్యామల చిన్నరాజులు సోకిలేరు వాగులో వినూత్నంగా బొత్త పద్ధతిలో చేపలవేట కోసం ఏర్పాటుచేసిన ప్రక్రియ అబ్బుర పరుస్తోంది. వాగు ఒడ్డున తాటాకులు, వెదురు బొంగులతో చిన్నపాటి చెరువులా గొయ్యని ఏర్పాటుచేసి అందులోకి చేపలు వచ్చేలా ఓ మార్గం ఏర్పాటుచేసాడు. ఆ నీటిలో తాటాకులు, పచ్చి కొమ్మలు, వేశాడు. అనంతరం దానిలో రెండు, మూడ్రోజుల పాటు ప్రతిరోజూ వరిపొట్టు, అన్నం, నూకలు వేస్తున్నట్లు చిన్నరాజులు తెలిపాడు. ఆహారాన్ని తినేందుకు వచ్చిన చేపలు పచ్చిరొట్టలో ఇరుక్కుని ఉంటాయని, చేపలు ఇరుక్కున విషయాన్ని గమనించి అవి తిరిగి బయటకు వెళ్లకుండా ద్వారం మూసేస్తానని తెలిపాడు. అనంతరం పచ్చిరొట్టలో ఇరుక్కుపోయిన చేపలను సేకరిస్తానని తెలిపారు.
చేపల వేటలో వినూత్నం


