టెన్త్ పరీక్షల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు
● డీఈవో బ్రహ్మాజీరావు
పాడేరు : రాబోయే టెన్త్ పరీక్ష కేంద్రాల్లో హజరయ్యే విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూర్చుతామని డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. కలెక్టర్ దినేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు శ్రీనివాసులరెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సెయింటాన్స్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో కాంపౌండ్ వాల్, బెంచీలు, లైట్లు, ఫ్యాన్లు, టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, ఫర్నిచర్, ఇతర అన్ని సౌకర్యాలను పరిశీలించారు. సౌకర్యాలు లేకపోతే అన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని హెచ్‌ఎంలకు ఆదేశించారు. ఆయన వెంట ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఆర్. శశికుమార్, విద్యశాఖాధికారులు మోరీ జాన్, సరస్వతిదేవి పాల్గొన్నారు.


