సరుకులు తెచ్చుకోవాలంటే వాగులు దాటాల్సిందే
● వంతెనలు లేక ఎర్నాపల్లి గిరిజనుల అవస్థలు
చింతపల్లి: మండలంలో ఎర్నాపల్లి గ్రామ గిరిజనులు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ఎర్రబొమ్మలు పంచాయతీ పరిధిలో గల ఈ గ్రామం నుంచి బయటకు రావాలంటే రెండు వాగులు దాటాల్సిందే. మోంథీ తుపాను ప్రభావం తగ్గినప్పటికీ వీటి ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో నిత్యావసరాలు తెచ్చుకునేందుకు వారు శనివారం ఈ రెండు వాగులను దాటాల్సి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంపై వాగులపై వంతెనలు నిర్మించాలని వారు కోరుతున్నారు.


