అవినీతి నిర్మూలనకు సహకరించండి
సీలేరు: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏపీ జెన్ కో సెక్యూరిటీ విజిలెన్‌న్స్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఇన్‌చార్జి ఈఈ జయపాల్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సెక్యూరిటీ విజిలెన్స్ ఇన్‌చార్జి కోటేశ్వరరావు, ఏవో సత్యనారాయణ, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
మోతుగూడెం: విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా శుక్రవారం ఏపీ జెన్‌కో సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం డీఏవీ స్కూల్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.
చీఫ్ ఇంజనీర్ రాజారావు, ఎస్‌ఈ చినకామేశ్వరరావు, డీఈ బాలకృష్ణ, సెక్యూరిటీ ఇన్‌చార్జి ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
అవినీతి నిర్మూలనకు సహకరించండి


