కాఫీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు రూరల్: కాఫీ కార్మికుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో కార్మికులు ఏపీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ కృష్ణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుందరరావు మాట్లాడుతూ 2024లో కాఫీ కార్మికులతో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందినప్పటికి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదన్నారు, ఏటా అక్టోబర్‌లో పెంచాల్సిన రోజువారీ కూలి ధరలు ఈ ఏడాది పెంచలేదన్నారు. వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేదన్నారు. దీనివల్ల ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందన్నారు. హెల్పర్లకు ప్లాంటేషన్ కండక్టర్‌గా పదోన్నతి కల్పించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కార్మికులు చిన్నలమ్మ, అప్పలమ్మ, లక్ష్మి, కాంతామణి పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు డిమాండ్


