గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
సీలేరు: మోంథా తుపాను ధాటికి ఏపీ జెన్ కో సీలేరు నుంచి డొంకరాయి వెళ్తున్న 33 కెవి విద్యుత్తు వైర్లపై రెండు భారీ వృక్షాలు కూలిపోవడంతో మంగంపాడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గూడెం కొత్తవీధి మండల సబ్ స్టేషన్ నుంచి దుప్పులువాడ స్టేషన్ వచ్చే 33 విద్యుత్ వైర్లపై సంపంగి గొంది అటవీ ప్రాంతం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు భారీ చెట్టు కూలిపోయింది. దీంతో దుప్పుల వాడ. దారకొండ. గుమ్మురేవుల. అమ్మవారి దారకొండ వంటి పంచాయతీ వందల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు.


