70 కిలోల గంజాయి స్వాధీనం
కశింకోట: స్థానిక పోలీసులు శుక్రవారం 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఏడు సెల్‌ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు... ముందగా అందిన సమాచారం మేరకు స్థానిక విల్లా ప్రాంతంలో జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో వచ్చిన ఆటోను పరిశీలించగా గంజాయి బయటపడింది. 35 ప్యాకెట్లలో 70 కిలోల గంజాయి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కుమార్, కొర్రా సత్తిబాబు, పాంగి ధర్మరాజు, కొర్రా బొంజిబాబు, సిందేరి జక్రయ్య, సేనాపలి మాణిక్యంలను అరెస్టు చేసినట్టు సీఐ చెప్పా రు. వారి నుంచి ఏడు సెల్ ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ తనిఖీల్లో హెచ్‌సీ జి.మధుబాబు, పీసీలు ఎల్.రాజశేఖర్, డి.గోపి, బి.ఉమామహేశ్వరరావు, బి.శ్రీనివాసరావు, వై.లక్ష్మణ్, బి. మహేశ్వరరావు, కె.బ్రహ్మాజీ, జె. కృష్ణ, పాల్గొన్నారు.


