రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు గిరిజన విద్యార్థి ఎంపిక
ముంచంగిపుట్టు: రాష్ట్రస్థాయి అండర్ 17 కబడ్డీ పోటీలకు మండలంలోని పెదగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో టెన్త్ చదువుతున్న వంతాల పాపారావు ఎంపికయ్యాడు. ఇటీవల పాడేరులోని తలరిసింగ్ క్రీడా మైదానంలో జరిగిన అండర్ 17 కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాడు. మండలంలోని రంగబయలు పంచాయితీ జర్రెలపొదర్ గ్రామానికి చెందిన పాపారావు ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెదగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో హెచ్‌ఎం కె.నారాయణ, పీడీ విశ్వనాథం,ఉపాధ్యాయులు గజేంద్ర, గుండుపడాల్, జగన్నాథం, ప్రసాద్ తదితరులు అతనిని అభినందించారు.


