అన్నవరం పోలీసుస్టేషన్ తనిఖీ
చింతపల్లి: మండలంలోని అన్నవరం పోలీసుస్టేషన్‌ను ఎస్పీ అమిత్‌బర్దర్ శుక్రవారం తనిఖీ చేశారు.చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాతో కలసి పోలీస్‌స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి కేసుల వివరాలు తెలుసుకున్నారు.అనంతరం రికార్డులను పరిశీలించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత జిల్లాగా గుర్తింపు తెచ్చేందుకు పోలీసులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలన్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా కాకుండా ఎప్పటికప్పుడు పోలీసు గస్తీ చేపట్టాలన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా రవాణా అవుతున్న దృష్ట్యా వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు.కార్యక్రమంలో సీఐ వినోద్‌బాబు, ఎస్‌ఐ వీరబాబు పాల్గొన్నారు.


