సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
● కలెక్టర్ దినేష్‌కుమార్
● 135 అర్జీల స్వీకరణ
పాడేరు : సమస్యలు పరిష్కారంపై ప్రత్యేకదృష్టి పెట్టాలని కలెక్టర్ దినేషకుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇతర అధికారులతో కలిసి ఆయన 135 వినతులను స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారమయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100ను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీల పరిష్కార సమాచారం తెలుసుకునేందుకు కాల్ సెంటర్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పద్మలత, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బీఎస్ నందు, డీపీవో చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల అధికారి రమణారావు, జిల్లా ప్లానింగ్ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.
ఘనంగా వల్లభాయ్ పటేల్ జయంతి
స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దినేష్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి


