పక్కాగా వారాంతపు ప్రణాళిక అమలు
పాడేరు : పీహెచ్‌సీల వారీగా గ్రామ స్థాయిలో నిర్వహించాల్సిన వైద్య సేవలపై రూపొందించిన వారంతపు ప్రణాళికను పక్కాగా అమలు చేసి శతశాతం పూర్తి చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. శుక్రవారం తన కార్యాలయం నుంచి జిల్లాలోని 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లతో జూమ్ ద్వారా వారంతపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమంలో 12 రకాల వైద్య సేవలను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోజుకు 25 మందికి రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి చికిత్స అందించాలన్నారు. మాతా, శిశువులకు నిర్దేశించిన సమయానికి టీకా వేయాలన్నారు. కీటక జనిత వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను ఆయన తెలుసుకున్నారు. రాఫిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసి ఫీవర్ సర్వే నిర్వహించాలన్నారు. ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్‌వైజర్ల సాయంతో గుర్తించిన మలేరియా కేసులకు సత్వర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ హెల్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రోగ నిర్థారణ అయితే వైద్యం అందించాలని సూచించారు. క్షయ రోగులకు నెలకు పౌష్టికాహార నిమిత్తం అందించే రూ.వెయ్యి సకాలంలో అందేలా చూసి వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వైద్యారోగ్య శాఖపై సమీక్షలు నిర్వహించినప్పుడు పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఆయన ఆదేశించారు. పచోడవరం డివిజన్ మారేడుమిల్లి పీహెచ్‌సీ, తాడేపల్లి ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్‌లో సీహెచ్‌వోగా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన డి. చైతన్య ప్రియ కుటుంబానికి యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో రూ.3 లక్షల చెక్కును డీఎంహెచ్‌వో అందజేశారు. ఈ క్రమంలో ఏడీఎంహెచ్‌వో డాక్టర్ టి. ప్రతాప్, డాక్టర్ పుల్లయ్య, డాక్టర్ సరిత, జిల్లా కుష్టువారణ అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి, జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ కమలకుమారి,యాక్సిస్ బ్యాంకు నోడల్ అధికారి పి. శ్యాంబాబు, జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఏవో సత్యనారాయణ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో కృష్ణమూర్తి నాయక్


