మారేడుమిల్లి ఏకలవ్యలో కళా ఉత్సవ్
● ఈనెల 3నుంచి
5వ తేదీ వరకు నిర్వహణ
● ఏర్పాట్లను పరిశీలించిన పీవో స్మరణ్‌రాజ్
రంపచోడవరం: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో కళా ఉత్సవ్–2025ను ఘనంగా నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. శుకవ్రారం ఆయన మారేడుమిల్లి ఏకలవ్య పాఠశాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు కళా ఉత్సవ్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన గ్రూప్ డ్యాన్సులు, పాటలు, గిరిజన తెగల వాయిద్యాలు ప్రదర్శిస్తారని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రిన్సిపాల్ శంకర్‌ప్రసాద్, ఏడీఎంఅండ్‌హెచ్‌వో సరిత, ఎంపీడీవో బాపన్నదొర, ఎంఈవో ముత్యాలరావు, తహసీల్దార్ బాలాజీ, ఆర్‌ఐ ఏసుబాబు పాల్గొన్నారు.


