వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం | - | Sakshi
Sakshi News home page

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం

Nov 1 2025 7:38 AM | Updated on Nov 1 2025 7:38 AM

వైద్య

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం

అరకులోయటౌన్‌: రాష్ట్రంలో వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కూటమి ప్రభుత్వం దిగివచ్చి నిలుపుదచేసే వరకు పోరాడుదామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు నిచ్చారు.మండలంలోని కొత్తభల్లుగుడ పంచాయతీ కొర్రాగుడ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ నాయకులకు గ్రామ మహిళలు గిరిజన సంప్రదాయంగా తిలకం దిద్ది, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేదలు, పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు శ్రీకారం చుడితే, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాటిని నిర్మించకపోగా, ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. దీంతో పేదలు, పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీఅధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వాడవాడలాల కోటి సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక పాలన, కుట్ర రాజకీయాలను గిరిజనులను వివరిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం దిగివచ్చి వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జెడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోషిణి, వైస్‌ ఎంపీపీ కిల్లో రామన్న, ఎంపీటీసీలు శత్రుఘ్న, దురియా ఆనంద్‌ కుమార్‌, స్వాభి రామచందర్‌, సర్పంచ్‌లు కొర్రా రాధిక, పాడి రమేష్‌, పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, పార్టీ ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, పార్టీ మండల అధ్యక్ష, ఉపాద్యాక్షులు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్‌ విజయ్‌ కుమార్‌, పంచాయతీ అధ్యక్షుడు కొర్రా అర్జున్‌, నాయకులు కమిడి అశోక్‌, సుందర్‌రావు, కామేష్‌, నగేష్‌, ఏలేష్‌, ధర్మనాయుడు పాల్గొన్నారు.

అనంతగిరి(అరకులోయటౌన్‌): మండలంలోని కోనపురం పంచాయతీ కితలంగి, బొండ్యగుడ గ్రామంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణ జరుపుతున్నామన్నారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలన్నారు. అనంతరం బొండ్యగుడ గ్రామంలో తుపానుధాటికి కూలిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సర్పంచ్‌లు గుబాయి రఘునాథ్‌, సెంబి సన్యాసిరావు, స్వాభి అప్పలరాజు, నాయకులు సత్యనారాయణ, మిటుకు, రఘునాథ్‌, రామచందర్‌, సుందర్‌రావు, సుందర్‌రావు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు: వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలో గల కర్రిముఖిపుట్టు పంచాయతీ దూళిపుట్టు, గొర్రెలమెట్ట, సరసంగి, వెచ్చంగి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శి ముఖి రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వలన కలిగే నష్టాలు వివరించడంతో స్వచ్ఛంధంగా సంతకాలు చేసి గిరిజనులు మద్దతూ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, వైద్య విద్య అందించాలనే సదుద్దేశ్యంతో వైఎస్సార్‌సీపీ చేసే మంచి కార్యక్రమానికి ప్రజల మద్దతూ తెలపాలని ఆయన కోరారు. నాయకులు అర్జున్‌, చలపతి, జోగారావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుదాం

అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం1
1/2

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం2
2/2

వైద్య కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement