రక్షణలేనిప్రయాణం
మన్యం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఎత్తయిన కొండలు.. పచ్చని చెట్లు.. ఆహ్లాదం కలిగించే ఘాట్‌రోడ్డు ప్రయాణం.. నేటి పరిస్థితి ఇందుకు భిన్నం. జిల్లాలో పాడేరు, అనంతగిరి, మారేడుమిల్లి, రంపుల ఘాట్‌మార్గాల్లో ప్రయాణం ప్రమాద కరంగా మారింది. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఎప్పుడు ఏప్రమాదం సంభవిస్తోందని ప్రయాణి కులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పాడేరు ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడటంతో ఘాట్ మార్గంలో అధ్వాన పరిస్థితులు మళ్లీ తెరమీదకు వచ్చాయి.
వర్షం పడితే చెరువే!
ప్రమాదాల నివారణకు చర్యలు
పాడేరుతో పాటు అన్ని ఘాట్‌రోడ్లలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం.కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఐదు మీటర్ల మేర వెడల్పు చేసేందుకు అంచనాలు రూపొందించాం.అటవీశాఖ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం.
– బాలసుందరబాబు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, ఆర్‌అండ్‌బీ, పాడేరు
జారిపడుతున్న కొండచరియలు, బండరాళ్లు
అంతర్రాష్ట్ర రహదారి అధ్వానం
సీలేరు: అంతర్రాష్ట్ర రహదారి అధ్వానంగా మారింది. ఈ మార్గంలో గూడెంకొత్తవీధి నుంచి ధారాలమ్మ తల్లి గుడి వరకు, సీలేరు నుంచి పాలగెడ్డ వరకు 40 కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారింది. అటవీప్రాంతాల్లో నీరు రోడ్డుపైకి వచ్చేయడంతో కోతకు గురైంది. వర్షం కురిసినప్పుడల్లా గోతులు చెరువులను తలపిస్తున్నాయి. గతేడాది వీటిని పూడ్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.23 కోట్లు విడుదల చేసింది. గత సంక్రాంతి నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో సంభవించిన భారీ తుపానుకు గూడెంకొత్తవీధి నుంచి సీలేరు వరకు కొండచరియలు విరిగిపడటంతో సుమారు 20 చోట్ల రోడ్డు దెబ్బతింది. అప్పటిలో వాటిని తాత్కాలికంగా తొలగించినా ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయి.
సాక్షి, పాడేరు: వర్షాలు కురిసినప్పుడల్లా జిల్లాలో ఘాట్‌రోడ్లలో ప్రయాణం భయంభయంగా మారుతోంది. ప్రధాన రోడ్లపై కొండచరియలు, బండరాళ్లు జారిపడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదకర మలుపులు వద్ద రోడ్డును ఆనుకుని కొండలు ఉన్నందున వర్షం పడినప్పుడల్లా బండరాళ్లు, కొండచరియలు జారిపడుతున్నాయి.
● మినుములూరు నుంచి గరికబంద వరకు సుమారు 25 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డులో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. పాడేరు నుంచి విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ప్రధాన రోడ్డు మార్గం వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం కురినప్పుడల్లా నీరు పోయేలే డ్రైనేజీలు లేకపోవడం వల్ల రోడ్డు, రక్షణగోడలు దెబ్బతింటున్నాయి.
● వంట్లమామిడి మలుపు వద్ద రక్షణగోడలు శిథిలమయ్యాయి. సుమారు 20 మీటర్ల పొడవునా దెబ్బతినడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
● ఏనుగురాయి దిగువ ప్రాంతంలో పలు మలుపులు వద్ద రక్షణగోడల పరిస్థితి దారుణంగా ఉంది.
● వంట్లమామిడి గ్రామం దాటిన తరువాత, కోమాలమ్మ పణుకు దిగువన పలు మలుపుల్లో రక్షణగోడలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాన్నాళ్ల నుంచి ఈ పరిస్థితి నెలకొని ఉన్నా అధికారవర్గాల్లో స్పందన కరువైంది.
● వర్షం పడినప్పుడల్లా రాజాపురం వద్ద రోడ్డుపైకి వాగుల నీరు వచ్చేస్తోంది. దీనివల్ల రోడ్డు దెబ్బతింటోంది.
● ఘాట్ మార్గంలో రోడ్డుకు ఒకవైపున ఫైబర్ కేబుల్ ఏర్పాటు నిమిత్తం తీసిన గోతులను పూర్తిస్థాయిలో పూడ్చలేదు. దీనివల్ల రోడ్డుదిగినప్పుడల్లా వాహనాలు దిగిపోయే పరిస్థితి నెలకొంది.
● వంజంగి కాంతమ్మ వ్యూపాయింట్‌కు సమీపంలో ఇప్పటివరకు సుమారు నాలుగుసార్లు కొండచరియలు జారిపడ్డాయి. ఈ పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా రోడ్డు అధ్వానంగా మారుతోంది. రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయినప్పటికీ ఆర్‌అండ్‌బీ అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టలేదు.
● రాజాపురం డౌన్‌లోని మర్రిచెట్టు సమీపంలో బండరాళ్లు దొర్లిపడిన సందర్భాలు లేకపోలేదు.
వర్షాలు కురిసినప్పుడల్లా ఘాట్ మార్గాల్లోప్రమాదకర పరిస్థితులు నిలిచిపోతున్న రాకపోకలు సమస్య పరిష్కారంపై దృష్టిపెట్టని పాలకులు
అనంతగిరి (అరకులోయ టౌన్): మండలంలోని శివలింగపురం నుంచి సుంకరమెట్ట వరకు సుమారు 40 కిలోమీటర్ల పొడవునా ఘాట్‌లో రక్షణ గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మలుపు వద్ద రక్షణగా ఏర్పాటుచేసిన ఐరన్ వాల్ వాహనాలు ఢీకొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ మార్గంలో ఎనిమిది ఎయిర్‌పిన్ బెండ్‌లు ఉన్నాయి. వీటిలో3, 5, 6, ఎయిర్‌పిన్ బెండ్‌ల వద్ద పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. వర్షం పడినప్పుడల్లా భీసుపురం వద్ద కొండలపైనుంచి రోడ్డుపైకి భారీగా వరదనీరు వచ్చేస్తుంది. ఇక్కడ సుమారు 4 అడుగుల లోతున నీరు నిలిచిపోవడంతో వాహనాలు గంటలతరబడి నిలిచిపోతున్నాయి. అనంతగిరి పీహెచ్‌సీ సమీపంలో రోడ్డును ఆనుకుని ఊటగెడ్డ ప్రవహించడంతో కోతకు గురైంది.
రక్షణలేనిప్రయాణం
రక్షణలేనిప్రయాణం
రక్షణలేనిప్రయాణం
రక్షణలేనిప్రయాణం
రక్షణలేనిప్రయాణం


