తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే ఉద్యమం
జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్ హెచ్చరిక
చింతూరు: గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గాన్ని మైదాన ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లాలో కలిపితే ఉద్యమం తప్పదని ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ హెచ్చరించారు. గురువారం చింతూరులో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కారం తమ్మన్నదొర పేరుతో ప్రత్యేకంగా రంపచోడవరం జిల్లాను ఏర్పాటు చేయాలని లేదంటే అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఆదివాసీలు కోరుకుంటున్న విధంగా రంపచోడవరం, పోలవరం నియోజకవర్గాలను కలిపి రంపచోడవరం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని ఆయన కోరారు.


