అదుపు తప్పితే లోయలోకి..
గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి 516–ఈ ప్రమాదభరితంగా మారింది. కొయ్యూరు మండలం కాకరపాడు నుంచి గూడెంకొత్తవీధి మండలం చాపరాతిపాలెం మీదుగా చింతపల్లి మండలం లంబసింగి వరకూ ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రహదారి నిర్మాణంలో భాగంగా రంపుల ఘాట్‌రోడ్లో కొండను తవ్వి దారిగా మలిచారు. మలుపుల్లో తవ్విన కొండ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జారి ప్రమాదకరంగా మారుతోంది. బండరాళ్లు, కొడచరియలు, మట్టి పెళ్లలు రహదారిపై విరిగిపడుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అధికారులు రహదారిపై హెచ్చరిక బోర్డులు, ప్రమాద సూచికలు ఏర్పాటుచేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌రోడ్‌లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదకరమైన మలుపులు వద్ద రక్షణగోడలు లేకపోవడంతో వాహనాలు అదుపుతప్పి లోయలోకి పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో మలుపుల వద్ద ఏర్పాటుచేసిన ఇనుపకంచె వాహనాలకు రక్షణగా నిలవలేకపోతోంది.
● ప్రధానంగా మారేడుమిల్లి మండలం పాములేరు సమీపంలో సీతారాముల విగ్రహాలకు పైనున్న మలుపు అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో రహదారి కోతకు గురైంది. పల్లానికి దిగుతున్న భారీ వాహనాలు మలుపు తిరగలేక అదుపుతప్పి కిందనున్న రహదారిపై పడిపోతున్నాయి. గతంలో కర్నాటకకు చెందిన భక్తుల వాహనం ఇదే ప్రాంతంలో ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. కాకినాడ ప్రాంతానికి చెందిన కొంతమంది చింతూరు వచ్చి తిరిగివెళుతున్న క్రమంలో ఇదే ఘాట్‌రోడ్‌లో గోపీ టర్నింగ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు.
రంపుల ఘాట్‌లో భయం భయం
అదుపు తప్పితే లోయలోకి..


