దెబ్బతిన్న వరిపైరు పరిశీలన
జి.మాడుగుల: మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటలను గురువారం చింతపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి, శాస్తవేత్తలు జోగా రావు, బాలహుస్సేన్‌రెడ్డి, ఏవో వరప్రసాద్ పరిశీలించారు. దీనిలో భాగంగా వారు సింగర్భ, నిట్టాపుట్టు, గొడ్డుబూసులు గ్రామాల్లో పర్యటించారు. ఈదురుగాలులకు నేలవాలిన వరిపైరును గుర్తించారు. ఇటువంటి పైరును కట్టలుగా కట్టి నిలబెట్టాలని రైతులకు సూచించారు. పొలాల్లో వరద నీరు నిల్వ లేకుండా అంతర్గత కాలువలు ఏర్పాటుచేసి బయటకు పంపాలని తెలిపారు. గింజ రంగు మారితే ఒక మిల్లీమీటరు ప్రొపికొనజోల్‌ను లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారి చేయాలని ఏడీఆర్ సూచించారు.


