కమనీయం శ్రీవారి కల్యాణం
సాక్షి,పాడేరు: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్,ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, గూడెంకొత్తవీధి జెడ్పీటీసీ శివరత్నం, పూజాసామగ్రి, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఏజెన్సీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లడ్డూ ప్రసాదాలను భక్తులకు టీటీడీ అధికారులు అందజేశారు. పాడేరులోని పలుశాఖల అధికారులు, ఉద్యోగులు ,వర్తకుల ఆర్థికసాయంతో భారీ స్థాయిలో అన్నసమారాధన ఏర్పాటుచేశారు. ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులు, మోదకొండమ్మ తల్లి ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, గృహనిర్మాణ సంస్థ డీఈఈ వంతెన్భ రాజబాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం, ముకుందు, కారం దేముడు, కొణతాల సతీష్, వర్తక సంఘం ప్రతినిధులు, మహిళా భక్తులు కల్యాణోత్సవ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
టీటీడీ అర్చకులకు ఘన సన్మానం
పట్టణంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా జరిపిన తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, టీటీడీ అధికారులు ఉమానీలకంఠేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం రాజరాజేశ్వరి దేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ అర్చకుడు ఉప్పల రామం, ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి, కమిటీ ప్రతినిధులు ఉప్పల వెంకటరత్నం, వంతెన్బ రాజబాబు దంపతులు ఘనంగా సన్మానించి, ఉమానీలకంఠేశ్వరస్వామి చిత్రపటాలను అందజేశారు.
కమనీయం శ్రీవారి కల్యాణం
కమనీయం శ్రీవారి కల్యాణం
కమనీయం శ్రీవారి కల్యాణం


