విధి నిర్వహణలో అలసత్వం వద్దు
డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్
పాడేరు: వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వద్దని ప్రతి ఒక్కరి సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయక్ ఆదేశించారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖను ప్రగతిపథంలో నడిపించేందుకు సరైన ప్రణాళికపరంగా పని చేయాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ఎవరికి కేటాయించిన విధులు వారు నిర్వర్తించాలన్నారు. రోజు వారీ విధులను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. జిల్లా పరిధిలోని ప్రజలు వైద్యారోగ్య సమస్యలపై ప్రతిరోజు కార్యాలయ పని దినాల్లో సాయంత్రం 3గంంటల నుంచి 6గంటలకు నేరుగా వచ్చి కలవాలని, లేకుంటే 7671868055 నంబర్‌కు ఫోన్ చేసి సమస్య తెలియజేయాలని సూచించారు.


