వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి
ముంచంగిపుట్టు: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ మండల ప్రధాన కార్యదర్శులు పాపారావు, సన్యాసిరావులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కించాయిపుట్టు పంచాయతీలోని పలు గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో యువతీయువకులు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పాపారావు, సన్యాసిరావులు మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి పేదలకు వైద్యం దూరం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నామన్నారు. కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఎంప్లాయిస్,పెన్షనర్ల యూనియన్ అధ్యక్షుడు మోదకొండ, వైఎస్సార్‌సీపీ మండల నేత కొండలరావు, పంచాయతీ బూత్ కన్వీనర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎటపాక: వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు ఆధ్యర్యంలో ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం కన్నాయిగూడెం, గుండాలలో పార్టీ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కురినాల వెంకటేశ్వర్లు, శీలం నాగేశ్వరావు, గుండాల ఉప సర్పంచ్ తోట శశి కుమార్, గుండి రాము, యర్రగొల్ల నరసింహరావు, దార రమేష్, చల్లా మణి, కాకని సురేష్, కల్పన, ముత్తిబోయిన రాము, ముక్కా శ్రీను, రాఖి సతీష్, యడ్ల బాలజీ, గుండి రామారావు, నడిపింటి దుర్గాప్రసాద్, కొత్తపల్లి సాత్విక్, మమిడి నవీన్ తదితరులు పాల్గొన్నారు
వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలి


