వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
గంగవరం : తుపాను కారణంగా భారీగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం అడిషనల్ డీఎంహెచ్‌వో పిల్లి సరిత వైద్య సిబ్బందిని సూచించారు. గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె బుధవారం సందర్శించారు. పీహెచ్‌సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫార్మసీ విభాగంంలోని మందుల స్టాకు, వ్యాక్సిన్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. బర్త్ వెయిటింగ్ హాల్‌లో ఉన్న గర్భిణులతో మాట్లాడి ఆరోగ్య భద్రతపై సూచనలిచ్చారు. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. సకాలంలో రక్త పరీక్షలు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న బర్త్ వెయిటింగ్ భవనాన్ని ఆమె సందర్శించి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అంబులెన్సు సర్వీసులపై ఆరా తీశారు, సమస్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ భావన, డాక్టర్ శ్వేత, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
అడిషనల్ డీఎంహెచ్‌వో సరిత


