పంట నష్టానికి పరిహారం చెల్లించండి
● మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్
హుకుంపేట: మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటనష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించిఆదుకోవాలని మాజీ ఎమెల్యే చెట్టి పాల్గుణ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని తాడిపుట్టు పంచాయతీలోని గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. ముంపునకు గురైన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతికందాల్సిన వరి పంట వరద పాలైందన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి బాధిత రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.


