మోంథా.. ముంచెత్తింది
మోంథా తుపాను ముంచెత్తింది. బుధవారం కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పాడేరు ఘాట్‌తో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి.పాడేరుకు సమీపంలోని జేసీ బంగ్లా రోడ్డు, లంబసింగి ఘాట్, అనంతగిరి మండలం నిమ్మలపాడు రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో వరద ప్రవాహంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పంట పొలాలు చాలా చోట్ల నీటమునిగాయి.
సమాచారమిచ్చినా రాలేదు
తుపానుకు జీలుగుచెట్టు పడటంతో ఇల్లుపై పడటంతో ఒకపక్క పూర్తిగా ధ్వంసమైంది. మాకు వేరే ఇల్లు లేదు. వైఎస్సార్‌సీపీ నేతలు పాంగి నరసింగరావు, పి.రాంప్రసాద్ సహకారంతో మండల అధికారులకు సమాచారం అందించాం. ప్రస్తుతానికి ఒక్క అధికారి కూడా మాగ్రామాన్ని సందర్శించలేదు. – వంతల గోపినాథ్,
సాగిరివలస, సొవ్వ పంచాయతీ
●
ఎటువంటి సాయం చేయలేదు
తుపాను వర్షాలకు మా పెంకుటిల్లు కూలిపోయింది. గ్రామానికి వచ్చిన అధికారులు జరిగిన నష్టాన్ని చూశారు. అయితే నష్టపోయిన మాకు ఎటువంటి సాయం చేయలేదు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. అధికారులు తక్షణం స్పందించి యుద్ధప్రాతిపదికన సాయం చేయాలి. – సాగర గుర్మిసింగ్, డుంబ్రిగుడ
సాక్షి,పాడేరు: జిల్లాలోని 163 గ్రామాలపై తుపాను ప్ర భావం చూపింది. పునరావాస కేంద్రాల్లో పూర్తిస్థాయి లో వసతులు లేక బాధితులు ఇబ్బందులు పడ్డారు.
● మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లోని అవతలి గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
● పాడేరు–పెదబయలు మండలాల సరిహద్దులోని పరదానిపుట్టు కాజ్‌వే మీదుగా మత్స్యగెడ్డ ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా సుమారు 100 మారుమూల గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. రాళ్లగెడ్డ, బొయితిలిగెడ్డ, చాపరాయిగెడ్డ, దిగుడుపుట్టు, సంతారి గెడ్డల్లో వరద ఉధృతి నెలకొంది.
500 ఎకరాల్లో పంటకు నష్టం
భారీ వర్షాలతో లోతట్టు వ్యవసాయ భూముల్లో ఖరీఫ్ పంటలకు నష్టం ఏర్పడింది. పాడేరు మండలం వంజంగి కొత్తవలస ప్రాంతంలో కొండవాగుల ఉధృతికి పంట భూముల మీదుగా వరద ప్రవాహం నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతదశలో ఉన్న వరి, రాగులు, చిరుధాన్యాల పంటలు వరదనీటి ముంపునకు గురయ్యా యి. చాలాచోట్ల వరిపంట నేలవాలింది. సుమారు 500 ఎకరాల్లో వరి, చిరుధాన్యాల పంటలకు నష్టం ఏర్పడిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
278 గుడిసెలు, మట్టి ఇళ్లకు నష్టం:
కలెక్టర్ దినేష్‌కుమార్
జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు 278 గుడిసెలు,మట్టి ఇళ్లకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ దినేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వీటిలో 12 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రూ.18.08 లక్షల వాటిల్లినట్టు ఆయన వివరించారు. అంతేకాకుండా నాలుగు పశువులు, 8 గొర్రెలు, మేకలు మృతి చెందగా రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణ నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 13 పునరావాస కేంద్రాల్లో 774 మందిని తరలించి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించామని ఆయన వెల్లడించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.3వేలు ఇస్తామని తెలిపారు.
పొంగిన వాగులు.. గాలులకు కూలిన చెట్లు
రాజవొమ్మంగి: రెండో రోజు బుధవారం రాజవొమ్మంగిలో రోజంతా ఈదురు గాలులతో వర్షం కురిసింది. కట్టెల పొయ్యిలపై ఆధారపడిన పేద గిరిజన కుటుంబాలు వంట చెరకు, నిత్యావసరాలకోసం ఇబ్బంది పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం నెలకొంది. వాగుల వరదనీరు వటిగెడ్డ రిజర్వాయర్‌లో చేరడంతో పొంగి ప్రవహించింది. ఈదురుగాలులకు దూసరపాము లబ్బర్తి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో మధ్యాహ్నం వరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుర్గానగర్ సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారిపై పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.
భూపతిపాలెం, ముసురుమిల్లికి జలకళ
రంపచోడవరం: మోంథా తుపానుకు కురిసిన వర్షాలు సాగునీటి ప్రాజెక్ట్‌లకు మేలు చేశాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. ముసురుమిల్లి ప్రాజెక్ట్‌కు గేట్లు ఏర్పాటుచేయకపోవడంతో నీరు దిగువకు పోతోంది.
రోడ్డుపై జారిపడిన కొండచరియలు
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతం పొంగి ప్రవహిస్తోంది. ఉరుము గ్రామ సమీపంలో రెండు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. పెదలంక, వైబీ గొందూరు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు ఇంటిపై కూలాయి. సొలభం వెళ్లే మార్గంలో కామెటమ్మ ఘాట్‌రోడ్డులో చెట్టు కూలిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో రహదారి దెబ్బతింది. వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లుపుట్టు–గొడ్డ మధ్యలో బ్రిడ్జి వద్ద, కుంబడిసింగి, రాళ్లగెడ్డ ఉధృతిగా ప్రవహించడంతో ఈమార్గంలో రాకపోకలు నిలిపివేశారు. కంఠవరం సమీపంలో వరద నీటికి వరి పంట నీటమునిగింది.
కొయ్యూరు: తుపాను వల్ల కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మంగళవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. విద్యుత్ సరఫరాకు మంగళవారం అర్ధరాత్రి నుంచి అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రానికి కూడా రాలేదు. డౌనూరు–చింతపల్లి రహదారిలో తులబాలగెడ్డ ఉధృతంగా ప్రవహించింది. దీంతో పోలీసులు నర్సీపట్నం– చింతపల్లి మార్గంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. చింతాలమ్మ ఘాట్‌రోడ్డులో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరుసగా రెండు రోజుల పాటు కొయ్యూరుకు నర్సీపట్నం డిపో నుంచి బస్సులు రాలేదు. దీంతో అత్యవసరమైన వారు మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు.
12 ఇళ్లకు నష్టం
వర్షాలకు మండలంలో 11 ఇళ్లు పాక్షికంగా ఒక ఇళ్లు పూర్తిగా దెబ్బతిందని ఇన్‌చార్జి తహసీల్దార్ కుమారస్వామి బుధవారం రాత్రి తెలిపారు. నష్టానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
నిలిచిన రాకపోకలు
హుకుంపేట: మండలంలో చీడిపుట్టు, లివిటి వంతెనలపైనుంచి గెడ్డలు పొంగి ప్రవహించడంతో అడ్డుమండ, జేకేమండ, రాప, ఉప్ప, మత్స్యపురం పంచాయతీలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
28 గ్రామాలకు రాకపోకలు బంద్
డుంబ్రిగుడ: కితలంగి పంచాయతీకి వెళ్లే మార్గంలో కాజ్‌వేపై నుంచి వరద నీరు ప్రవహించడంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చంపపట్టి వద్ద కాజ్‌వేపై నుంచి గెడ్డ పొంగి ప్రవహించడంతో సుమారు 8 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. చాపరాయి వద్ద ఉన్న పెద్దపాడు, కోసంగి గ్రామాల వారధిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో వాటితోపాటు అరకులోయ మండలంలోని పలు గ్రామాలకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆయా ప్రాంతాల గిరిజనులు నిత్యావసర సరకులకు ఇబ్బందులు పడ్డారు. చాపరాయి గెడ్డ వరదనీటితో పోటెత్తింది.
వరద బీభత్సం నుంచి తేరుకోని మన్యం
బుధవారం ఈదురుగాలులతో
భారీ వర్షం
వరద ఉధృతి తగ్గని గెడ్డలు, వాగులు
కూలిన చెట్లు
వందలాది గ్రామాలకు రాకపోకలు బంద్
పరిహారంకోసం బాధితుల ఎదురుచూపులు
ప్రభుత్వం చెప్పేదానికి భిన్నంగా
క్షేత్రస్థాయి పరిస్థితులు
మోంథా.. ముంచెత్తింది
మోంథా.. ముంచెత్తింది
మోంథా.. ముంచెత్తింది
మోంథా.. ముంచెత్తింది
మోంథా.. ముంచెత్తింది
మోంథా.. ముంచెత్తింది
మోంథా.. ముంచెత్తింది


