శిథిల భవనాలను కూల్చివేయండి
డుంబ్రిగుడ: తుపానుకు నేలకూలిన పాఠశాల భవనాన్ని పూర్తిగా తొలగించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం రాత్రి భారీ వర్షానికి నేలకూలిన వంతర్డ పాఠశాల భవనాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. భవన శిథిలాలను వెంటనే తొలగించేలా ఎంపీడీవోకు ఆదేశాలు ఇచ్చారు. మండలంలో ఇలాంటి భవనాలను ముందుగానే గుర్తించి కూల్చివేయాలన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఎంఈవోలు సుందరరావు, గెన్నును ఆదేశించారు. పాకలో పాఠశాల నిర్వహిస్తున్న ఆయన అక్కడి వెళ్లారు. పశువుల పాకలా ఉన్న దీనిలో విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తారని అధికారులను ప్రశ్నించారు. వంతర్డ గ్రామంలో సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అంతకుముందు డుంబ్రిగుడలో గృహాలను పరిశీలించారు. లివిటిపుట్టులో పాఠశాల భవన నిర్మాణం పూర్తికి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఈవోలను ఆదేశించారు.
ఎంఈవోలకు కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
శిథిల భవనాలను కూల్చివేయండి


