వైఎస్సార్‌సీపీ నేత చొరవతో..
పాడేరు రూరల్: భారీ వర్షాలకు మండలంలోని వంట్లమామిడి పంచాయతీ 12వ మైలురాయి గ్రామ సమిపంలో ఈదులపాలెం ప్రధాన రహదారి మార్గంలో బుధవారం భారీ వృక్షం విరిగి పడింది. స్థానికులు పంచాయతీ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. దీంతో వైఎస్సార్‌సీపీకి చెందిన వార్డు సభ్యుడు పాతను సింహాచలం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, గిరిజనులు చెట్టు కొమ్మలను తొలగించారు. మొదలు భాగాన్ని జేసీబీ సాయంతో తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.
ముంచంగిపుట్టు: మండలంలోని జర్రెల పంచాయతీ కొత్తూరు గ్రామంలో బుధవారం కొర్ర సోనాయి అనే గిరిజన మహిళ ఇంటి గోడ కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మండల వైఎస్సార్‌సీపీ నేత సురేష్, వార్డు సభ్యుడు పరశురాం, పీసా కమిటీ కార్యదర్శి జీనబంధు అక్కడికి వెళ్లి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. గోడ కూలిన విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారిని కోరారు.


