వరద ఉధృతి ఉంటే రాకపోకలు వద్దు
డుంబ్రిగుడ: వరద ఉధృతి ఉన్న వంతెన మార్గంలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన కొర్ర పంచాయతీ సరిహద్దు ఒంటిపాక జంక్షన్ వద్ద వంతెనను పరిశీలించారు. బ్రిడ్జిపైనుంచి వరదనీరు ప్రవహించడంతో ఈ మార్గంలో ప్రయాణించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గేవరకు పంటలు కోయకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరును సంప్రదించాలన్నారు. ఎంపీడీవో ప్రేమసాగర్, తహసీల్దార్ త్రివేణి పాల్గొన్నారు.
హుకుంపేట: చీడిపుట్టు వద్ద వంతెనపై నుంచి వరదనీరు ప్రవహించడంతో ఈమార్గంలో రాకపోకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. మంగళవారం ఈ ప్రాంతంలో పర్యటించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
వాగులపై కల్వర్టుల పరిశీలన
చింతూరు: చింతూరు, కూనవరం మండలాల్లో మంగళవారం ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ పర్యటించారు. వాగులపై కల్వర్టులను పరిశీలించారు. వరద ప్రభావిత గ్రామాలు, పునరావాస కేంద్రాలు, పల్లపు ప్రాంతాలు, కంట్రోల్ రూంలు, నిత్యావసర సరకుల పంపిణీ వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పల్లపు ప్రాంతాలు, నదీ తీరప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుఫాను దృష్ట్యా బుధవారం ఐటీడీఏలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు పీవో తెలిపారు.
వరద ఉధృతి ఉంటే రాకపోకలు వద్దు


