మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో బీభత్సం సృష్టించాయి. వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలవిద్యుత్ కేంద్రాలకు నీరందించే ప్రాజెక్ట్‌ల నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఘాట్‌రోడ్లు ప్రమాదకరంగా మారడంతో రాత్రిపూట ప్రయాణాన్ని అధికారులు నిలిపివేశారు. కొత్తవలస–కిరండూల్ రైల్వేలైన్‌లో కొండచరియలు జారిపడ్డాయి. అనంతగిరి ఘాట్ రోడ్డులో కొండ వాగుల ప్రవాహం రోడ్డుపైకి వచ్చేయడంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు.
సాక్షి,పాడేరు: మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి ఈదురు గాలులు వీస్తున్నాయి. జనజీనవం స్తంభించింది. ప్రధాన గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో విస్తరించిన రాళ్లగెడ్డ ఉధృతికి చీడిపుట్టు కాజ్‌వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. లో వరద ప్రవాహం అఽధికంగా ఉండడంతో చీడిపుట్టు కాజ్‌వే మీదుగా వరదనీరు జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, హుకుంపేట, ముంచంగిపుట్టు మండలాల్లో విస్తరించిన మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. అరకులోయ మండలంలోని మారుమూల మాదల పంచాయతీలో వేగవతి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో సరిహద్దు ఒడిశా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలులకు పాడేరు మండలం నందిగరువులో చెట్టు నేలకూలింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో సుత్తిగుడ వద్ద భారీ వృక్షం నేలకూలింది. జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్‌లో కూలిన చెట్లను అధికారులు వెంటనే తొలగించారు. రాజవొమ్మంగి మండలంలోని వణకరాయి, దూసరపాము జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఇదే మండలంలో అనంతగిరి వెళ్లే మార్గంలో చెట్టు కూలిన ఘటనలో పాకలో మేక అక్కడికక్కడే మృతి చెందింది. వరద పరిస్థితులను జిల్లా కేంద్రంలో కలెక్టర్ దినేష్‌కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఇన్‌చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
కొత్తవలస– కిరండూల్ రైల్వే లైన్‌లో చిమిడిపల్లి సమీపంలోని టన్నెల్ వద్ద కొండచరియలు ట్రాక్‌పై జారి పడ్డాయి.సుమారు గంట పాటు కొండ నుంచి వరదనీరు ట్రాక్‌పై పొంగి ప్రవహించింది. బండరాళ్లు,మట్టి పేరుకుపోవడంతో వాటిని తొలగించే పనుల్లో రైల్వే అధికారులు నిమగ్నమయ్యారు. ఈమార్గంలో సోమవారం రాత్రి నుంచి అన్ని రైళ్ల రాకపోకలను ముందస్తుగా నిలిపివేతతో పెద్ద ప్రమాదం తప్పింది.
అనంతగిరి ఘాట్‌రోడ్డుపైకి వరద ప్రవాహం
అరకులోయ–అనంతగిరి ఘాట్‌లో సుంకరమెట్ట, బీసుపురం సమీప ప్రాంతాల్లో రోడ్డుపై వరదనీరు పొంగి ప్రవహించింది. భారీ వర్షాలకు కొండల నుంచి వరదనీరు రోడ్డుపైకి వచ్చేయడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ఈ మార్గంలో మంగళవారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.
జిల్లాలో 534.6 ఎంఎం వర్షపాతం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 534.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.అత్యధికంగా అనంతగిరిలో 78.8, ముంచంగిపుట్టులో 45.8, అరకులోయలో 41.2, డుంబ్రిగుడలో 35.6, హుకుంపేటలో 34.6, పాడేరులో 34.2, కొయ్యూరులో 30.2, జి.మాడుగులలో 29, అడ్డతీగలలో 22.2, పెదబయలులో 21.6, దేవీపట్నంలో 19.8, రంపచోడవరంలో 19.6, చింతపల్లిలో 17.8, వై.రామవరంలో 17.6, రాజవొమ్మంగిలో 16.6, మారేడుమిల్లిలో 13.8, గూడెంకొత్తవీధిలో 13.4, గంగవరంలో 10.8, చింతూరులో 10.2, కూనవరంలో 7.6. వీఆర్‌పురంలో 7.4, ఎటపాక మండలంలో 6.8 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది.
పొంగిన చాపరాయి గెడ్డ
డుంబ్రిగుడ: తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు చాపరాయి గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో పెద్దపాడు, కోసంగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటసీమ రోడ్డు మార్గంలో డోమంగి వద్ద వంతెనపై నుంచి పొంగి ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కొయ్యూరు: మండలంలో మంగళవారం వీచిన బలమైన ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొయ్యూరు కాలువ ఉధృతంగా ప్రవహించింది.
జి.మాడుగుల: మండలంలో మోంథా తుపాను వర్షాలకు మంగళవారం గెమ్మెలి పంచాయతీ జి కొత్తూరులో బొంగరం వెంకటరావుకు చెందిన ఇంటిగోడ కూలిపోయింది. సొలభం పంచాయతీ వయ్యారిగరువులో పాంగి బాలరాజు ఇల్లు పాక్షికంగా దెబ్బతింది.
పొంగిన గెడ్డలు, వాగులు
వంతెనలపై నుంచి వరద నీటి ప్రవాహం
ఈదురు గాలులకు కూలిన చెట్లు
ప్రమాదకరంగా ఘాట్‌రోడ్లు
ముందు జాగ్రత్తగా రాకపోకలు
నిలిపివేసిన అధికారులు
రైల్వేలైన్‌పై జారిపడిన కొండచరియలు
ముందురోజే రాకపోకలు నిలిపివేతతో తప్పిన భారీ ప్రమాదం
అత్యధికంగా అనంతగిరిలో
78.8 ఎంఎం వర్షపాతం నమోదు
ప్రమాదస్థాయికి బలిమెల నీటిమట్టం
ఉధృతంగా మత్స్యగెడ్డ
రైల్వే ట్రాక్‌పై కొండచరియలు జారిపడటంతో
దెబ్బతిన్న ప్రాంతం
మూతపడిన పర్యాటక ప్రాంతాలు
డుంబ్రిగుడ: మోంథా తుపాను కారణంగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని చాపరాయి జలవిహారి, అరకు పైనరీ, కొల్లాపుట్టు కాటేజీలు మూతపడ్డాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం వరకు మూసివేసినట్టు నిర్వాహకులు తెలిపారు.
మోతుగూడెం: కొండ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈనీటికి పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నీరు తోడవడంతో సీలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బలిమెల ప్రాజెక్ట్‌కు వరద తాకిడి నెలకొంది. ఈ ప్రాంతం నుంచి గుంటవాడ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.
రంపచోడవరం/చింతూరు: తుపాను నేపథ్యంలో మారేడుమిల్లి–చింతూరు ఘాట్‌రోడ్డులో రాత్రి పూట ప్రయాణాలను నిలిపివేసినట్టు మారేడుమిల్లి సీఐ గోపినరేంద్రప్రసాద్, చింతూరు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వారు సూచించారు.
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం
వర్ష బీభత్సం


