రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా
● ఏర్పాటు చేయాలి
● ఆదివాసీ జేఏసీ డివిజన్ ఛైర్మన్
జల్లి నరేష్ డిమాండ్
చింతూరు: రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం చింతూరులో జరిగిన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రంపచోడవరం జిల్లా ఏర్పాటు వల్ల పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు. పాడేరు దూరాభారం కావడంతో ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కారం సాయిబాబు, పొడియం రామకృష్ణ, కాక సీతారామయ్య, మడివి రాజు, తిరపతిరావు, ముత్తయ్య, రామయ్య, సుబ్బయ్య, నాగయ్య, రాజమ్మ పాల్గొన్నారు.


