గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్
జల్లిపల్లి సుభద్ర
● సరియాపల్లి, గుమ్మసిరగంపుట్టులో
సీసీ రోడ్లకు శంకుస్థాపన
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో జెడ్పీ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ సరియాపుట్టులో జెడ్పీ నిధులు రూ.10లక్షలతో 200 మీటర్ల సీసీరోడ్డుకు, గుమ్మాసిరగంపుట్టు గ్రామ సమీపంలో బరడ వెళ్లే మార్గంలో జెడ్పీ నిధులు రూ.5లక్షలతో 100 మీటర్ల సీసీరోడ్డు పనులకు బుధవారం ఆమె సర్పంచులు,ఎంపీటీసీలు,నేతల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. దశాలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తాగునీటి బోర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామన్నారు. జగనన్న స్ఫూర్తితో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నడూ లేనివిధంగా జెడ్పీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎంపీపీ సీతమ్మ, వైస్‌ఎంపీపీ భాగ్యవతి, జేసీఎస్ జిల్లా కోఆర్డినేటర్ జగబంధు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచులు సుభాష్‌చంద్ర, నరసింగరావు, గంగాధర్, ఎంపీటీసీలు సుబ్బలక్ష్మి, కమల, నబ్బో, గణపతి పాల్గొన్నారు.


