ప్రజలను అప్రమత్తం చేయండి
అరకులోయటౌన్: మోంథా తుపాను ప్రభావం దష్యా ప్రజలను అప్రమత్తం చేయాలని మండల ప్రత్యేకాధికారి కె. కర్ణ అధికారులకు ఆదేశించారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. అవసరమైన వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగే అవకాశం ఉందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా వాటి పునరుద్దరణకు సిద్దంగా ఉండాలన్నారు. కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అన్ని శాఖ అధికారుల సమన్వయంతో పనిచేసి విద్యుత్, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. రిలీఫ్ రిష్యూ ఆపరేషన్‌లు అవసరమైన విపత్తు నిర్వహణ బృందాల సహకారం తీసుకోవాలన్నారు. హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్లు 6281779281, 9866266806 సంప్రదించాలన్నారు. ఎంపీడీఓ లవరాజు, ఎంఈఓ త్రినాధ్‌రా వు, ఎస్‌ఐ గోపాలరావు, మండలస్ధాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చింతపల్లి: మోంథా తుపాను ప్రభావంతో ప్రజలకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా మండల స్ధాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి వి.విజయ్‌రాజ్ అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో అన్ని మండలస్థాయి అదికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల అన్ని పంచాయతీల పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులను వాగులు వంకలు దాటి ప్రయాణాలు చేయకుండా అప్రమత్తం చేయాలన్నారు. పంచాయితీస్థాయి అధికారులు సిబ్బంది స్థానికంగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని మండల కేంద్రానికి తెలియజేయాలన్నారు. తుపాను ప్రభావంతో ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా మండల స్థాయి అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దార్ శంకరరావు, ఎంఈవో ప్రసాద్, ఏపీవో రాజు, ఏపీఎం శ్రీనివాసరావు, ఏవో మధుసూదనరావు, సీడీపీవో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను అప్రమత్తం చేయండి


