జలాశయాల గేట్లు ఎత్తివేత
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలాపుట్టు జలాశయాల అధికారులు మోంథా తుఫాన్‌తో అప్రమత్తమయ్యారు. తుఫాన్‌తో సరిహద్దులో విస్తారంగా భారీ వర్షాలు కురిస్తాయని, నీటి నిల్వలు పెరుగుతాయని ముందగానే భావించిన జలాశయాల అధికారులు నీరు విడుదల చేస్తున్నారు. డుడుమ జలాశయం నీటి మట్టం 2,590 అడుగులు కాగా సోమవారం నాటికి 2,583.60 అడుగులుగా నమోదైంది. డుడుమ జలాశయం ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా, ప్రస్తుతం 2,747.95 అడుగులు ఉంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జోలాపుట్టు జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి ఉదయం 10 వేల క్యూసెక్కుల నీటిని డుడుమకు విడుదల చేశారు, క్రమేపి నీటి విడుదల పెంచుతూ సాయంత్రం 5గంటలకు 18వేల క్యూసెక్కుల నీటిని డుడుమ జలాశయంలోకి విడుదల చేశారు.డుడుమ జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి 14వందల క్యూస్కెల నీటిని దిగువనున్న బలిమెల జలాశయానికి విడుదల చేశారు.
డొంకరాయి డ్యామ్ నుంచి..
మోతుగూడెం: తుఫాన్ నేపథ్యంలో డొంకరాయి జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జలాశయం ఏడు గేట్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్‌కో అధికారులు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డొంకరాయి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,037 అడుగులు కాగా 1,034 అడుగులకు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదిపై రాకపోకలు సాగించవద్దని జెన్‌కో అధికారులు తెలిపారు.
జోలాపుట్టు నుంచి 18వేలు, డుడుమ నుంచి 14వేల క్యూసెక్కుల నీరు విడుదల
జలాశయాల గేట్లు ఎత్తివేత
జలాశయాల గేట్లు ఎత్తివేత


