అథ్లెటిక్స్ పోటీల్లో మెరిసిన గిరిజనుడు
ముంచంగిపుట్టు: మండలంలోని పెదగూడ పంచాయతీ జర్రిపడ గ్రామానికి చెందిన గిరిజనుడు కుర్తాడి ప్రసాద్ అథ్లెటిక్స్ పోటీ ల్లో మెరిశాడు. ఈ నెల 26న విశాఖపట్నంలోని పోలీసు బేరక్స్ మైదానంలో వెటరన్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాస్టర్స్ వెటరన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రసాద్ సత్తా చాటాడు. 800 మీటర్ల పరుగులో మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్‌త్రోలో మూడో స్థానంలో నిలిచాడు. ప్రసాద్‌కు పతకాలతో పాటు సర్టిఫికెట్లను విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అందజేశారు. డిసెంబర్ 13,14 తేదీల్లో గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి రన్నింగ్ పోటీలకు ప్రసాద్ ఎంపికయ్యాడు.
800 మీటర్ల పరుగులో మొదటి స్థానం


