జోరుగా వర్షాలు
మోంథా ఎఫెక్ట్..
● అప్రమత్తమైన అధికారులు
● ఆందోళనలో అన్నదాతలు
సాక్షి, పాడేరు: మోంథా తుఫాన్ ప్రభావంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం నుంచి పాడేరుతో పాటు అన్ని మండలాల్లోను జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో గిరిజన రైతుల్లో ఆందోళన నెలకొంది. వరితో పాటు చిరుధాన్యాల పంటలు కోత దశలో కళకళాడుతున్నాయి. వర్షాల కారణంగా పంటలు నష్ణపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని జీకేవీధిలో 20.2 మిల్లీమీటర్లు, అడ్డతీగలలో 8.4, దేవిపట్నంలో 2,8, గంగవరంలో 2.8, అరకులోయలో 2.2, డుంబ్రిగుడలో 2, పాడేరులో 1.4, అనంతగిరి 1.2, వై.రామవరంలో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు
తుఫాన్ కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినట్టు కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ సోమవారం తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, అన్ని ఉన్నత,ప్రాథమిక పాఠశాలలు తెరవవద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా
ఉండాలి: పీవో స్మరణ్‌రాజ్
రంపచోడవరం: తుఫాన్ నేపథ్యంలో కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్ ఆదేశించారు. ఐటీడీఏలో ఏర్పాటు చేసిన తుఫాన్ కంట్రోల్ రూమ్‌ను పీవో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్‌కు సంబంధించిన సమాచారం, ప్రజల ఇబ్బందులను తెలుసుకుని నివేదికలు ఇవ్వాలని తెలిపారు. ఏడు మండలాల్లో బాధితుల నుంచి కంట్రోల్ రూమ్‌కు సమాచారం వ చ్చిన వెంటనే స్పందించి తగు చర్య లు తీసుకోనున్నట్టు చెప్పారు. ఎప్పటికప్పుడు పర్య వేక్షించాలని ఏపీవో జనరల్ డి.ఎన్.వి. రమణను ఆదేశించారు. పీవో వెంట డీటీ జిలానీ, బి.మార్గదర్శి, పి.లక్ష్మిరెడ్డి, నాగేంద్ర తదితరులు ఉన్నారు.
జోరుగా వర్షాలు


