కోటి సంతకాలతో ప్రైవేటీకరణను అడ్డుకుందాం
అనంతగిరి(అరకులోయటౌన్): కోటి సంతకాల సేకరణతో వైద్యకళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందామని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని చిలకలగెడ్డ, కాశీపట్నంలలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రామ సభలు, కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపు ఉన్నారన్న అక్కసుతో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తోందని చెప్పారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా, పేదలకు ఉచిత వైద్యం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతల సన్నిహితుల జేబులు నింపడానికే కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి కై నా కూటమి ప్రభుత్వ పెద్దలు వైద్య కళాశాలల ప్రైవేటీ కరణను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శెట్టి నీలవేణి, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పాగి అప్పారావు, చిలకలగెడ్డ సర్పంచ్ అప్పారావు, మాజీ ఎంపీపీ రవణమ్మ, జిల్లా బిసీ సెల్ అధ్యక్షుడు కుమార్, పార్టీ నాయకులు పైడమ్మ, సింహాచలం, సన్యాసిరావు, సీతమ్మ, కె. సత్యావతి, కమ్మన్న, రమేష్, కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మత్స్యలింగం
కోటి సంతకాలతో ప్రైవేటీకరణను అడ్డుకుందాం


