పర్యాటక ప్రాంతాలు మూసివేత
ఎర్రవరం జలపాతానికి వెళ్లే రహదారిని
మూసివేస్తున్న రెవెన్యూ సిబ్బంది
చింతపల్లి: తుఫాన్ నేపథ్యంలో మండలంలో పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్టు తహసీల్దారు కె.శంకరరావు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎటువంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఎర్రవరం జలపాతం, చెరువులు వేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయం తదితర పర్యాటక ప్రాంతాలను మూసివేసినట్టు ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే రహదారులపై రాకపోకలను నిషేధించినట్లు తెలిపారు. తమ సిబ్బందితో రోడ్డుకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు.


