వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు
అడ్డతీగల: అడ్డతీగల మండలం పనుకురాతిపాలెం వద్ద పెద్దేరు వాగుపై రాకపోకలు సాగిస్తున్న ప్రజలకు సోమవారం కౌన్సిలింగ్ ఇచ్చినట్టు ఎంపీడీవో ఎ.వి.వి.కుమార్ తెలిపారు.తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా వాటిపై ప్రమాదకర పరిస్తితుల్లో రాకపోకలు సాగించవద్దన్నామన్నారు.తాము వాగు వద్దకు వెళ్లేసరికి వాగు దాటడానికి ప్రయత్నిస్తున్న పనుకురాతిపాలెం గ్రామస్తులను ఆపి పరిస్థితిని వివరించినట్టు చెప్పామన్నారు.ట్యూబులతో ప్రజలను వాగు దాటించడానికి యత్నిస్తున్న ఓ గ్రామస్తుడిని అడ్డుకొని గెడ్డదాటకుండా హెచ్చరించామన్నారు. రానున్న మూడు రోజులో మోంథా తుపాను ప్రభావంతో వర్షాలు అధికంగా కురుస్తాయని ఎవ్వరూ వాగులు, వంకలు దాటకుండా ఇంటి వద్దనే ఉండాలని వారికి తెలియజేశామన్నారు.
సీలేరు: సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో సీలేరు. దారకొండ. దుప్పులు వాడ. గుమ్మరేవులు. అమ్మవారి దారకొండ వంటి పంచాయతీలో గ్రామస్తులు గిరిజనులు మోంథా తుపానుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణం శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమైంది అన్ని చర్యలు చేపడుతుంది. గిరిజనులు ఎవతూ తుపాను మూడు రోజులు ఇంట్లోంచి బయటకు రావద్దని ప్రమాదంగా ప్రవహించే వాగులు గెడ్డలు దాటవద్దని ప్రమాదంగా ఉన్న గ్రామాలను ఇప్పటికే గుర్తించి మహిళా పోలీసుల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నామని. ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే సీలేరు పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే దవెంటనే చర్యలు చేపడతామని ఎవరు ఎటువంటి ఆందోళన పడవద్దని కోరారు. అలాగే గ్రామంలో ఉన్న యువకులు అప్రమత్తంగా ఉండి వృద్ధులు, చిన్నారులు పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ సందర్భంగా సీనియర్ ఎస్‌ఐ యాసీన్ సోమవారం పలు గ్రామాలను సందర్శించి తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని ఏమి జరిగినా తక్షణమే సమాచారం ఇస్తే ఆదుకుంటామని కోరారు.
వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు


