
మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఐటీడీఏ డీడీ పరిమళ
కిల్లోగుడ ఆశ్రమ పాఠశాలలో
రికార్డులు పరిశీలిస్తున్న డీడీ పరిమళ
డుంబ్రిగుడ: పాఠశాలల్లో మెనూ అమలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ హెచ్చరించారు. మండలంలోని కిల్లోగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా వసతి గదులతో పాటు పరిసరాలు, పాఠశాల రికార్డులు, భోజనం మెనూ చార్ట్‌ను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెనూ ప్రకారం ప్రతిరోజు విద్యార్థులకు భోజ నం పెట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యా యు లు కృషి చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఏటీ డబ్ల్యూవో రమణ, ప్రధానోపాధ్యాయుడు ఎల్.వెంకటరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.