
పర్యాటకులకు రక్షణ కల్పించాలి
పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్
కొత్తపల్లి జలపాతాన్ని సందర్శిస్తున్న
పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్
జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని పాడేరు డీఎస్పీ ఎస్.షహబాజ్ అహ్మద్ ఆదేశించారు. జలపాతాన్ని శనివారం ఆయన సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలు, వసతిపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యూపాయింట్,జలపాత ప్రాంతాలను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ షణ్ముఖరావు, జలపాతం సూపర్‌వైజర్ వంతాల అభి, నిర్వాహకులు పాల్గొన్నారు.