
సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు
అవగాహన కల్పిస్తున్న ఉద్యానవన
పరిశోధన స్థానం శాస్త్రవేత్త బిందు
చింతపల్లి: గిరిజన రైతులు జీవనియంత్రణ పద్ధతులపై అవగాహనతో పసుపు, మిరియా లు పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. ఉద్యాన పరిశోధన స్థానంలో గిరిజన రైతులకు అంబాజిపేట ఏఐిసీఆర్‌ిపీ బయో కంట్రోల్ ఆధ్వర్యంలో జీవనియంత్రణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసుపు,అల్లం మిరియాలు వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంభించాలన్నారు. టాటా ట్రస్టు సాంకేతిక నిపుణుడు అప్పలరాజు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.